BREAKING
వరుస వికెట్లతో భారత్‌కు షాక్.. 14 ఓవర్లలో 134/5 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ 'RC17' మూవీ లాంఛనంగా ప్రారంభం: పూజా కార్యక్రమంలో మెగా అభిమానుల సందడి ఓటీటీలోకి వచ్చేసిన 'అనకాపల్లి' సినిమా: సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ డేట్ ఖరారు రానా వినూత్న హారర్ ప్రాజెక్ట్: కంగనా రనౌత్ హీరోయిన్‌గా రవిబాబు దర్శకత్వంలో 'స్కారీ పిక్చర్' ఆర్‌జీవీకి 29.67 కోట్ల లీగల్ నోటీసు: ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రొడక్షన్ హౌస్ సంచలన హెచ్చరిక ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారుల పరామర్శ వైసిపి ఆటలు సాగనివ్వం పవిత్రమైన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి ... -- వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ వణుకుతున్న తీర ప్రాంతాలు.. న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొడుతున్న ఇషాన్-శ్రేయస్.. 10 ఓవర్లలో భారత్ 111/2 చెన్నై అపోలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు........... డాక్టర్ సెంథిల్ కుమార్ ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి – డీఎస్పీ ప్రభాకర్ 53, వ డివిజన్ సందర్శించిన డాలర్స్.

జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి

Select Suryaa Now
జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి

పూడూరు, మేజర్ న్యూస్:జన్మభూమిపై మమకారం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ, సేవా కార్యక్రమాల పట్ల నిబద్ధతతో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. పరిగి నియోజకవర్గం పూడూరు మండలం పెద్ద ఉమెంతాల్ గ్రామంలో ఆయన పర్యటించి ఆధ్యాత్మిక, క్రీడా, విద్యా రంగాలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో మమేకమై సంప్రదాయాలకు గౌరవం చాటడంతో పాటు యువత, విద్యార్థులను ప్రోత్సహిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.పెద్ద ఉమెంతాల్ గ్రామంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన శ్రీ తిరుమల దేవుని రథోత్సవ వేడుకల్లో పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 అనంతరం గ్రామంలో నిర్వహించిన మూడో ఖోఖో ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించి క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని, యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉమెంతాల్ గ్రామంలో ఖోఖో ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించడం గ్రామీణ క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.అదేవిధంగా కళావతి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో నిరుపేద విద్యార్థులకు రూ.4 లక్షల 50 వేల విలువైన ల్యాప్‌టాప్‌లను పట్నం మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థులు వెనుకబడకుండా ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఎంతటి ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ పుట్టిన ఊరును, జన్మభూమిని మరువకుండా గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులు, నిరుపేద విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పెద్ద ఉమెంతాల్ గ్రామంలో ఒకే పర్యటనలో ఆధ్యాత్మిక వేడుకలు, ఖోఖో ప్రీమియర్ లీగ్ ప్రారంభం, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ బేగరి జానకి సుభాష్, మాజీ సర్పంచ్ అల్లు శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అన్వి రెడ్డి, డీసీటీవో వెంకటయ్య, అల్లు ముకుంద రెడ్డి, చింతల సత్యనారాయణ, అల్లు నాగిరెడ్డి, క్రాంతి, ముక్కంటి జంగయ్య, మహమ్మద్ మియా తదితరులు పాల్గొన్నారు.