ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణములు ఆదివారం రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిట శ్రీహరి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఈర్లదిన్నె శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి రహమతుల్లా, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు,వార్డు కౌన్సిలర్ కోట్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమేష్, సాయి రాఘవ, వెంకట్ రెడ్డి, దామోదర్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.