చింతలమానేపల్లిలో ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు
సూర్య, చింతలమానేపల్లి : కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో ఆదివాసీ వీరుడు, జల్–జంగల్–జమీన్ నినాద ప్రదాత కొమురం భీమ్ వర్ధంతి వేడుకలను ఉపసర్పంచ్ తొంబ్రే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన పోరాటాలను, ఆదివాసీల హక్కుల కోసం సాగించిన ఉద్యమాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల పోషక్క, మాజీ సర్పంచ్ ప్రసాద్, గ్రామ పెద్దలు, మహిళలు, ఆదివాసీ సంఘాల నాయకులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.