పట్టభద్రుల ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి: నీరుడు పవన్ సాయి
కిస్మత్‌పూర్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం
(గండిపేట్, మేజర్ న్యూస్) : అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని నీరుడు పవన్ సాయి కోరారు. కిస్మత్‌పూర్‌లోని అపోలో ఫార్మసీ సమీపంలో ఆయన బృందం ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులు తమ వివరాలను నమోదు చేసుకొని, ప్రజాస్వామ్యంలో తమ భాగస్వామ్యాన్ని చాటుకోవాలని సూచించారు. ఓటు హక్కు కల్పించేందుకు చేపట్టిన ఈ నమోదు కార్యక్రమాన్ని పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.