ఓటు హక్కును వినియోగించుకొన్న ఎస్ ఆర్ సి చైర్మన్ రాజగోపాల్.
కళ్యాణదుర్గం: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, మహీధర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డేకాలనీలో ఏర్పాటు చేసిన 18/1వ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారు తమ ఓటును నమోదు చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా తమ బాధ్యతను నెరవేర్చారు. ఈ సందర్భంగా ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాలని తెలిపారు. ప్రజలు వేసే ప్రతి ఓటు పట్టణ భవిష్యత్తును, అభివృద్ధి దిశను నిర్ణయించడంలో కీలకమవుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని, ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి నెలకొనగా, ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, మహీధర్ రెడ్డి వడ్డేకాలనీలోని 18/1వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.