టి డి పి ఎన్నికల ప్రచారానికి విశేష స్పాందన.
కుందుర్ప మండల పరిధిలోని కొలిమిపాళ్యం, అప్పాజీపాళ్యం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం సోమవారం ఉత్సాహభరితంగా సాగింది. జడ్పీటీసీ అభ్యర్థి జి.ఎల్. ప్రభావతి, ఎంపీటీసీ అభ్యర్థి సుజాతమ్మ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజల నుంచి లభించిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆశీస్సులతో, ధనుంజయ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రజలకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సహకారం, ప్రభుత్వ పథకాల అమలు ఎంతో అవసరమని పేర్కొంటూ టీడీపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మహిళలు, యువత ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొనడం టీడీపీ శ్రేణులకు మరింత బలాన్నిచ్చింది. ప్రజల ఆదరణ, కార్యకర్తల కృషితో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.