telangana
సత్యం ట్రెడిషనల్ యోగ ఆశ్రమాన్ని సందర్శించిన విజేత విద్యార్థులు
సూర్య ఖానాపూర్ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నవాపేటలో గల సత్యం ట్రెడిషనల్ యోగ ఆశ్రమాన్నిఖానాపూర్ లోని విజేత పాఠశాల విద్యార్థులు సందర్శించి పలు విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ గురువు సత్యం విద్యార్థులకు ఆయుర్వేద వైద్యం, యోగ, ధ్యానం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం విద్యార్థులకు తలెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ విద్యార్థులలో మనోధైర్యం నింపారు. తదనంతరం ఆశ్రమంలో రోగులకు అందించే వైద్యాన్ని విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా ఆశ్రమంలో పెంచుతున్న వివిధ రకాల పండ్ల మొక్కలను మరియు అవి ఆయుర్వేద వైద్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. ఇందులో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.