జడ్పీటీసీ తేజోవతి విజయానికి కూటమి నేతల విస్తృత ప్రచారం
రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థి తేజోవతిని గెలిపించాలని కోరుతూ సోమవారం రేణిగుంట పట్టణంలో కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తూ అభ్యర్థి తేజోవతికి మద్దతుగా ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట టీడీపీ నాయకులు దినేష్, సుధా తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.