BREAKING
చెరువు కట్టకు బీటలు.. ప్రమాదం పొంచి ఉంది! విశ్రాంత ఉద్యోగి రాంబాబుకు ఏపీ ఎన్జీవో సంఘం నివాళి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి - బీజేపీ కిసాన్ మోర్చా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి రష్యా యుద్ధంలో గాజువాక యువకుడు.. తల్లి కన్నీటి వేదన నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు - జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజావాణికి వెల్లువెత్తిన సమస్యల వినతులు హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భేటీ! మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపికి వినతి చిన్నారుల భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి -శిశుగృహ ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి పాస్టర్ల నూతన కమిటీ ఎన్నిక నేడే పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం

వడ్డెర కాలనీలో అక్రమ బెల్టు షాపులపై పోలీసుల దాడులు రూ.40 వేల విలువైన మద్యం స్వాధీనం.. నలుగురిపై కేసులు

Select Suryaa Now
వడ్డెర కాలనీలో అక్రమ బెల్టు షాపులపై పోలీసుల దాడులు  రూ.40 వేల విలువైన మద్యం స్వాధీనం.. నలుగురిపై కేసులు

సూర్య మంచిర్యాల టౌన్ : పట్టణంలోని వడ్డెర కాలనీలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపులపై మంచిర్యాల పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఆది మధుసూదన్, పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న నలుగురిని గుర్తించి,వారి వద్ద నుంచి సుమారు రూ.40 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.వడ్డెర కాలనీకి చెందిన ఒల్లెపు కుమార్, గౌతమినగర్‌కు చెందిన యైదా లక్ష్మణ్, వడ్డెర కాలనీకి చెందిన ఎడగొట్టు పున్నం,వల్లెపు సాయి కుమార్‌లు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అనంతరం నలుగురిని స్వాధీనం చేసుకున్న మద్యంతో సహా పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.అనుమతులు లేకుండా మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.