BREAKING
నఫీజ్ భాషాకు కేంద్ర హోంమంత్రి దక్షతా పతకం --జాతీయ స్థాయిలో గుర్తింపు.. --గుంటూరు రేంజ్ నుంచి ఎంపికైన ఏకైక అధికారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి ప్రజావాణికి 68 దరఖాస్తులు . ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల నిరాహార దీక్ష సామ రామ్మోహన్ రెడ్డి మద్దతు కౌంటింగ్ కేంద్రాలపై జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. పారదర్శకంగా, సమన్వయంతో ఓట్ల లెక్కింపు చేపట్టాలి ఫిర్యాదులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ నగేష్ భారతీయ యానిమేషన్ ప్రపంచంలో సంచలనం: 18 నెలల్లో బిలియన్ వ్యూస్ సాధించి నెట్‌ఫ్లిక్స్‌ను ఏలుతున్న ‘ఎమోమీ’! మంత్రి సీతక్కను కలిసిన స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు పొడిగించాలిః మంత్రి పొన్నం కవిత ఆశయాలకు ఆకర్షితులై ‘తెలంగాణ రక్షణ సేన’లో చేరికలు సత్యం ట్రెడిషనల్ యోగ ఆశ్రమాన్ని సందర్శించిన విజేత విద్యార్థులు కాషాయమయమైన నిర్మల్ - మహా పాదయాత్రకు సర్వం సిద్ధం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘హనుమాన్ అంశ్’: సినిమా హక్కులపై నిర్మాతల కఠిన హెచ్చరిక! మహేందర్ కుటుంబాన్ని పరామర్శించిన మండల ఫోటోగ్రాఫర్లు వడ్డెర కాలనీలో అక్రమ బెల్టు షాపులపై పోలీసుల దాడులు రూ.40 వేల విలువైన మద్యం స్వాధీనం.. నలుగురిపై కేసులు ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి - జిల్లా ఎస్పీ. డా. జి. జానకి షర్మిల

రాప్తాడు దాడి కేసు నిందితుడికి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స.

Select Suryaa Now
రాప్తాడు దాడి కేసు  నిందితుడికి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స.

అనంతపురం: రాప్తాడులో విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన కేసులో పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు హేమంత్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం. ప్రస్తుతం అతడు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కాల్పుల్లో అతడి కాళ్లలో మూడు బుల్లెట్లు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ముఖానికి కూడా గాయాలు కావడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇప్పటివరకు నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించినట్లు సమాచారం. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్‌ అందిస్తూ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిందితుడి కాళ్లకు తీవ్రస్థాయిలో గాయాలు కావడంతో వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు స్కానింగ్‌ పరీక్షలు నిర్వహించి, బుల్లెట్లు తగిలిన ప్రాంతాల్లో రక్తనాళాలు, ఎముకలు, ఇతర కణజాలాలకు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించనున్నారు. పరీక్షల నివేదికలు వచ్చిన అనంతరం గాయాల తీవ్రతను అంచనా వేసి తదుపరి చికిత్సపై వైద్య బృందం నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు రాప్తాడు ఘటనలో విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో అతడు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం నిందితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించారు. చికిత్సకు శరీరం ఏ విధంగా స్పందిస్తుందనే అంశం కూడా కీలకంగా మారింది. కాళ్లను తొలగించాల్సిన అవసరం ఏర్పడుతుందా లేదా అన్నది స్కానింగ్‌ నివేదికలు, వైద్య పరీక్షల అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు నిందితుడి ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ := బోయ రంగస్వామి.