వాలీబాల్ క్రీడా సామాగ్రిని అందజేసిన ఎస్సై లోకేష్ కుమార్.
కంబదూరు: విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడంతోపాటు వారిని క్రీడల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు కంబదూరు ఎస్సై లోకేష్ కుమార్ తనవంతు సహకారం అందించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఆయన, తన సొంత నిధులతో రూ.5 వేల విలువైన వాలీబాల్ క్రీడా సామగ్రిని కొనుగోలు చేసి సోమవారం కళాశాలలో అధ్యాపక బృందం సమక్షంలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరుచుకుంటూ క్రీడా రంగంలోనూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆకాంక్షించారు. క్రీడలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు మానసిక ఉల్లాసం, ప్రశాంతతను అందిస్తాయని వివరించారు. ప్రతిరోజూ కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, సమయపాలన, స్నేహభావం, సద్భావన వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని హితవు పలికారు. చిన్నతనంలో ఏర్పడే అలవాట్లు భవిష్యత్తు జీవితంపై ప్రభావం చూపుతాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూపించే మార్గంలో నడుస్తూ వారి సూచనలు, సలహాలను పాటిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. యువత సమాజానికి కీలకమైన శక్తి అని, సమాజ పురోగతిలో వారి పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సానుకూల ఆలోచనలు, మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి చదువు, క్రీడలు, ఇతర రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల అభ్యర్థనపై తక్షణమే స్పందించి సొంత నిధులతో క్రీడా సామగ్రిని అందజేసిన ఎస్సై లోకేష్ కుమార్కు కళాశాలరంగస్వామ విద్యార్థులు, అధ్యాపక బృందం కృతజ్ఞతలు తెలిపారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.