కూటమినేతల మాయ మాటలు నమ్మకండి.. ఎర్రకోట రాజీవ్ రెడ్డి
ఎమ్మిగనూరు, సూర్యప్రతినిధి
అధికారం కోసం ఎన్నో మాయమాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి మూడేళ్లుగా ప్రజలు మోసం చేస్తూ స్థానిక సంస్థల్లో ఓట్లు అడిగేందుకు మరోసారి మాయమాటలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్న కూటమి నేతల మాయలో పడి సైకిల్ గుర్తుపై ఓటు వేయకుండా.. అనేక సంక్షేమ పథకాలు అందించిన జగనన్న ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన ఎంపీటీసీ అభ్యర్థులు నాగలదిన్నె.. 1పెద్ద ఈరన్న నాగలదిన్నె ట.. 2 యు.లక్ష్మి తోపాటు నందవరం జడ్పిటిసి హనుమంత మా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మిగనూరు వైకాపా ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలో పర్యటించారు అక్కడ ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నెలకు 1500 ఇస్తానని మోసం చేసిన వారికి ఓటు వేస్తారా.. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని మోసం వారికి ఓటు వేస్తారా.. కొత్త పెన్షన్లు మంజూరు చేయని వారికి ఓటు వేస్తారా.. భూ కబ్జాలు చేసే వారికి ఓటు వేస్తారా ఒక్కసారి ఆలోచించుకోండి అన్నారు.. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఒక్కరే ఉంటే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వింతగా విజయవాడలో ఒకరు ఎమ్మిగనూరులో మరొకరు ఉంటూ ఎమ్మెల్యేలుగా పాలన సాగిస్తున్నారని దేవ చేశారు. తుంగభద్రా నదిని గంగవరం నుండి నాగలదిన్నె వరకు దోచుకున్న ఇసుక సంపద నాయకులు మీకు కావాలా అన్నారు.. లాంటి నాయకులు మీ గ్రామాలకు తాగునీరు ఇబ్బంది కలిగించలేదా గుర్తుపెట్టుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగనన్న పార్టీ నిలబెట్టిన ఫ్యాను గుర్తుకు ఓటు వేసి మన పెద్దలు చెన్నకేశవరెడ్డి ఆశీస్సులతో నాగలదిన్నె కు మండల పరిషత్ అధ్యక్షురాలుగా నియమిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ గెలుపుతో మీ ఎంపీటీసీలను పంపాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిఆర్ బసిరెడ్డి, కె ఆర్ లక్ష్మీకాంతరెడ్డి , విరుపాక్షి రెడ్డి, గురజాల నరసింహారెడ్డి, లింగమూర్తి నాగప్ప రమేష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.