BREAKING
గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి - బీజేపీ కిసాన్ మోర్చా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి రష్యా యుద్ధంలో గాజువాక యువకుడు.. తల్లి కన్నీటి వేదన నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు - జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజావాణికి వెల్లువెత్తిన సమస్యల వినతులు హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భేటీ! మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపికి వినతి చిన్నారుల భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి -శిశుగృహ ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి పాస్టర్ల నూతన కమిటీ ఎన్నిక నేడే పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ఓట్ బచావో దేశ్ బచావో... కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

కాషాయమయమైన నిర్మల్ - మహా పాదయాత్రకు సర్వం సిద్ధం

Select Suryaa Now
కాషాయమయమైన నిర్మల్ - మహా పాదయాత్రకు సర్వం సిద్ధం
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 3న నిర్మల్ పట్టణంలో నిర్వహించనున్న  "లోక్‌తంత్ర బచావో – అరాచకత హటావో” మహా పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహా పాదయాత్ర నేపథ్యంలో నిర్మల్ పట్టణం కాషాయ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో కాషాయమయంగా మారింది. నగరమంతా బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.ఈ మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు హాజరుకానుండటంతో కార్యక్రమంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ సంస్థల గౌరవం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజలకు పిలుపునిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ మహా పాదయాత్రకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
నిర్మల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడేలా.. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.