BREAKING
గాజు గ్లాసు గుర్తుకు ఓటెయ్యండి, జనసేన పార్టీ నేత దండి నరేంద్ర టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌తో ఇమ్రాన్ హష్మీ.. పవర్ స్టార్ సినిమా తర్వాత డిఫరెంట్ రోల్‌లో ఎంట్రీ! మురుసు తుఫాన్ ప్రభావం - నీట మునిగిన వరి పంటలు - కౌలు రైతుల ఆవేదన మక్కువ లో రంగు నాయుడు గర్జన కోనాడలో తెదేపా రెబల్ అభ్యర్థి సత్తిబాబు గెలుపు పై ధీమా పేరూరులో అశేష జన సమూహం మద్య ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం !! అంతర్జాతీయ పాప్ వేదికపై భారత్ సత్తా చాటేందుకు ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ మిచెల్ చోంగ్ ప్రత్యేక అన్వేషణ! వనంగుడిలో రంజిల్లిన వేదసభ విజయం పై ధీమా వ్యక్తం చేసిన ఆళ్లగడ్డ జెడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలి. భారీ అంచనాల మధ్య రామాయణం ఐమ్యాక్స్ ట్రైలర్ విడుదల.. సరికొత్త విజువల్ వండర్‌గా సినిమా! రెవెన్యూ సేవలలో అలసత్వాన్ని సహించేది లేదని పారదర్శక రెవిన్యూ పాలన లక్ష్యం శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు పాత రేగ దుప్పలపూడి గ్రామాల్లో విస్తృత పర్యటన రాజమహేంద్రవరం లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన ప్రకృతి వ్యవసాయంతో భూసార పరిరక్షణ

మేనేజర్లకు ఆర్థిక పరిజ్ఞానంపై శిక్షణ

Select Suryaa Now
మేనేజర్లకు ఆర్థిక పరిజ్ఞానంపై శిక్షణ

పటాన్‌చెరు:వ్యాపార రంగంలో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన ఆర్థిక పరిజ్ఞానం,ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో రెండు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ నెల 19, 20 తేదీల్లో అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘సంఖ్యల నుంచి వ్యూహం వరకు.. నిర్వాహక నైపుణ్యం కోసం ఆర్థిక పరిజ్ఞానం 'అనే అంశంపై హైబ్రిడ్ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఫైనాన్స్‌లో అధికారిక నేపథ్యం లేని మేనేజర్లు, వృత్తి నిపుణులకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఆర్థిక విశ్లేషణ, వ్యయ నిర్మాణాలు,బడ్జెట్ రూపకల్పన, పెట్టుబడుల అంచనా, మూలధన కేటాయింపు, పెట్టుబడిపై రాబడి వంటి అంశాలపై ఆచరణాత్మక అవగాహన కల్పించనున్నారు. వాస్తవ వ్యాపార పరిస్థితులు, కేస్ స్టడీల ద్వారా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంపొందించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగానికి చెందిన డాక్టర్ సుశోభన్ పాల్,డాక్టర్ మెరుగు వేణుగోపాల్ నిర్వహించనున్నారు. పాల్గొనే వారికి అభ్యాస సామగ్రితో పాటు ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు పేర్ల నమోదు, రుసుము వివరాల కోసం 84209 66501 నంబర్‌ను సంప్రదించాలని లేదా cbe@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని నిర్వాహకులు సూచించారు.