గ్రామాల సమగ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించండి.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా నవంబర్ 5, 2026న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి స్థానిక సంస్థల బలోపేతంతోనే సాధ్యమవుతుందని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయాల్సి ఉందని తెలిపారు. రైతులకు సాగునీటి వసతులు, వ్యవసాయానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు మహిళలు, యువత, విద్యార్థులు, పేద కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే ప్రజలతో మమేకమై పనిచేసే ప్రజాప్రతినిధులు ఎన్నిక కావాలని పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గ్రామాల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఎన్నికలని, ఓటర్లు తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజల మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించడం ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి సహకరించాలని డాక్టర్ తలారి రంగయ్య విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సాధనకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.