BREAKING
ప్రజావాణికి 19 దరఖాస్తులు -12 మంది అధికారుల హాజరు వేపులపర్తి ప్రభుత్వం ప్రచారం జోరు.. రంగయ్య పై విమర్శలు చేసిన ఎమ్మెల్యే అమిలినేని. కౌంటింగ్ అధికారులకు స్వయంగా శిక్షణ ఇచ్చి, సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వాలీబాల్ క్రీడా సామాగ్రిని అందజేసిన ఎస్సై లోకేష్ కుమార్. అనుమతుల్లేని బోర్లపై రెవెన్యూ శాఖ కొరడా! ప్రఖ్యాత స్కామ్ ఫ్రాంచైజీ నుంచి మరో సంచలనం: సుబ్రత్ రాయ్ బయోపిక్‌గా ‘స్కైమ్ 2010’ టీజర్ విడుదల! ఎమ్మెల్యే రాక కోసం ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు. వికారాబాద్ జిల్లాలో విషాదం.. మిస్సింగ్ కేసు నమోదు కాగా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దింది జ్యోతికే: భార్యపై ప్రశంసలు కురిపించిన హీరో సూర్య! కఠిన భద్రతా వలయంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్: బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచి అభిమానులకు దర్శనం! రాప్తాడు దాడి కేసు నిందితుడికి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స. కింగ్ ‘తు మిల్ జాయే’ పాటలో సుహానా ఖాన్: సర్‌ప్రైజ్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ! జడ్పీటీసీ తేజోవతి విజయానికి కూటమి నేతల విస్తృత ప్రచారం కూటమినేతల మాయ మాటలు నమ్మకండి.. ఎర్రకోట రాజీవ్ రెడ్డి ‘మురసు’ తీవ్ర తుఫాన్ ఉధృతి: ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల బీమా

Select Suryaa Now
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల బీమా
అమరావతి:రాష్ట్రంలో రైతాంగానికి సాగు భద్రత కల్పించడమే లక్ష్యంగా పంటల బీమా పథకం అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి విపత్తులు, మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పంటల బీమా వర్తింపజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

వేరుశనగ, పత్తి, టమోటా వంటి ప్రధాన వాణిజ్య పంటలకు కూడా విస్తృతంగా బీమా సౌకర్యం కల్పించినట్లు ఈ సందర్భంగా బీమా కంపెనీల ప్రతినిధులు సీఎంకు నివేదించారు. ప్రభుత్వం తరఫున అందజేస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీకి అదనంగా పంటల బీమా పరిహారం సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. ప్రతి రైతు ఎక్కడా నష్టపోకుండా పంటల బీమా చేసుకునేలా వారిని చైతన్యపరచాలని, ఈ దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.