BREAKING
జోరుగా.. హుషారుగా.. *హోరు వర్షంలోనూ రేవతి ఎన్నికల ప్రచారం బొబ్బిలి ఆర్డీవో కార్యాలయంలో బ్యాలెట్ బాక్సులు భద్రం మూడు దశబ్దాల తర్వాత అ'పూర్వ"సమ్మేళనం.. బీజేపీ మహాపాదయాత్రలో పాల్గొన్న అమిత్‌షా ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు గ్రాండ్‌గా ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ హడావుడి: రేపే ‘ఈఎన్ఈ రిపీట్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల! జిల్లాలో విద్యుత్తు వినియోగదారుల దినోత్సవం మెదక్​ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్​ఈ నారాయణ నాయక్ నాగర్ కర్నూల్ లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు 25 ఏళ్ల తర్వాత సైదాపురం మండలంలో టీడీపీ జెండా ఎగురవేస్తాం! అందరినీ సంతృప్తిపరచాలంటే ఐస్‌క్రీమ్ అమ్మాలి: నెగెటివ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ ఘాటు వ్యాఖ్యలు! ఆయుష్ మల్టీ పర్పస్ వర్కర్ల పోస్టులకు దరఖాస్తుదారులకు ఈ నెల 6న రాత పరిక్ష వైసీపీ యువ నాయకుడు టీడీపీలో చేరిక మురసు తుఫాను ప్రభావంతో విద్యుత్‌ శాఖ అప్రమత్తం - పొదలకూరు విద్యుత్ ఏ.ఈ.రఘు రణ్‌బీర్ కామెంట్లపై ఆర్జీవీ కౌంటర్: సోషల్ మీడియాలో సెటైరికల్ ట్వీట్స్ వైరల్! వల్లిపేడులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆర్ధిక సహాయం

అనుమతుల్లేని బోర్లపై రెవెన్యూ శాఖ కొరడా!

Select Suryaa Now
అనుమతుల్లేని బోర్లపై రెవెన్యూ శాఖ కొరడా!

కొండాపూర్‌ ; కొండాపూర్‌ మండల పరిధిలోని మమ్మ దా పూర్ శివారులోని   116వ సర్వే నంబర్‌లో ఉన్న అంకుర వెంచర్‌లో అనుమతులు లేకుండా వేసిన బోర్లను తహసీల్దార్‌ అశోక్‌ ఆధ్వర్యంలో  సీజ్‌ చేశారు. ప్రస్తుత నీటి సంక్షోభం, కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్‌ తెలిపారు.ఈ సందర్భంగా తహసీల్దార్‌ అశోక్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ క్షేత్రాలు, చెరువుల సమీపంలో కొత్త బోర్లు తవ్వకుండా ఆర్‌ఐలు, గ్రామ పాలనాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. వాల్టా చట్టం ప్రకారం అనుమతులు లేకుండా బోర్లు వేస్తే స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే సంబంధిత అనుమతులతో బోర్లు వేయాలని సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ మల్లేశం, జీపీఓలు రమేష్‌, పాండు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.