BREAKING
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఓ వైపు జోరువాన.. మరోవైపు కోటంరెడ్డి ప్రచార హోరు! నే'తలరాతలు' తేలేది నేడే..! స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులకు దుస్తులు, సామగ్రి కొనుగోలుకు దరఖాస్తుల ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న 'మురాసు' తీవ్ర తుఫాను మాజీ మంత్రి నల్లపరెడ్డి ని కలిసిన కొడవలూరు మండల వైసీపీ నూతన అధ్యక్షుడు మారంరెడ్డి.. కాఫీ విత్ కరణ్ షో చివరి సీజన్‌పై కరీనా ఆసక్తికర వ్యాఖ్యలు: సైఫ్ అలీఖాన్ జోక్‌తో నవ్వులు! ముడి చమురు ధరల పతనంతో 1233 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ఎదులపాడ్‌లో నూతన భవనాల నిర్మాణానికి ఏకగ్రీవ తీర్మానం మరి కొన్ని గంటల్లో పురపాలక ఎన్నికల ఫలితాలు. అభ్యర్థుల్లో ఉత్కంఠ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్,సైన్స్ ఫెయిర్ లలో సత్తా చాటిన గీతాంజలి విద్యార్థులు ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఐదో సీజన్ వేదిక ఖరారు నెల్లూరులో జనసేన–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు.. చివరి వరకు ఉత్కంఠ కుమారి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలను సందర్శించిన ట్రైనీ అధికారులు పుణె నగరానికి రూ. 21,800 కోట్ల మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

జోరుగా.. హుషారుగా.. *హోరు వర్షంలోనూ రేవతి ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
జోరుగా.. హుషారుగా.. *హోరు వర్షంలోనూ రేవతి ఎన్నికల ప్రచారం

పూసపాటిరేగ, సూర్య : అభివృద్ధి తారక మంత్రంగా కూటమి తరుపున పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి కోట్ల రేవతి ఎన్నికల ప్రచారం వర్షం సైతం లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోతుంది. గోవిందపురం తో పాటు పూసపాటిరేగ, పూసపాటి పాలెం, రెల్లి వలస, బత్తివలస గ్రామాలలో జడ్పిటిసి అభ్యర్థిగా గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను రేవతి ఆకర్షించే ప్రయత్నం చేశారు. గోవిందపురంలో జనసేన తరపున పోటీ చేస్తున్న జడ్పిటిసి అభ్యర్థిని కోట్ల రేవతి, తన భర్త, జనసేన నాయకుడు రఘు తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా, రేవతి ఎన్నికల ప్రచారానికి మద్దతుగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. జడ్పిటిసి గా రేవతిని గెలిపిస్తే కలిగే ప్రయోజనాలను గోవిందపురం ఎంపీటీసీ అభ్యర్థిగా విక్రమ్ జగన్నాథం వివరించారు. తనను గతంలో పలుమార్లు సర్పంచ్ గా, ఎంపీటీసీ గా గెలిపించినందుకు విద్యుత్ ఉపకేంద్రం, జడ్పీ హైస్కూల్, వెటర్నరీ, పీహెచ్సీ, బాలికల వసతి గృహం వంటి సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేశానంటూ జగన్నాథం గుర్తు చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ గ్లాసు గుర్తుపై కోట్ల రేవతి పోటీ చేస్తున్నందున అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రేవతి జడ్పీ నిధులతో గ్రామాలను మరింత అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటారంటూ ఓటర్లకు తన ఎన్నికల ప్రచారంలో జగన్నాథం వివరించారు. అదేవిధంగా పూసపాటిరేగ లో రేవతి తన భర్త రఘుతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. జడ్పిటిసి గా రేవతిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మండల కేంద్రమైన పూసపాటి రేగ ను జిల్లాలోనే ఆదర్శ మండల కేంద్రంగా తీర్చిదిద్దుతానంటూ రఘు వాటర్ లకు హామీ ఇచ్చారు. రెల్లి వలస, బత్తివలస గ్రామాలలో కూడా జడ్పిటిసి అభ్యర్థిని కోట్ల రేవతి ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన రేవతికి అధిక సంఖ్యలో మహిళలు హారతుల పట్టి విజయ తిలక కుంకాలను దిద్ది దీవెనలను అందించారు.