BREAKING
మల్లిపల్లి కూటమిలో చేరిన 11 కుటుంబాలు. ఇటలీలో పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పోస్టులకు భారీగా కోత క్రికెట్, ఎనర్జీతో ‘హై’ మూవీ ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ విడుదల: యూత్‌ను ఆకట్టుకుంటున్న బీట్స్! నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం కావాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి... * కార్మిక సహాయ అధికారి జయశంకర్ * పలాస-కాశీబుగ్గ ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... * మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు * పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమ నిల్వ.. - ఆరు క్వింటాళ్లు పట్టివేత ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ టాటా సన్స్ అంతర్గత వివాదాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు - సూర్య ఎఫెక్ట్ - స్పందించిన ఎమ్మెల్యే ఐటీసీకి షాక్...పెరిగిన సిగరెట్ ధరలతో పడిపోయిన విక్రయాలు ఘనంగా ఊర పండగ విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి. అక్రమ చేప పిల్లల వేటను అరికట్టాలి - ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కమ్యూనిస్టు విప్లవోద్యమ అమరవీరులకు ఘన నివాళులు*

నెల్లూరులో జనసేన–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు.. చివరి వరకు ఉత్కంఠ

Select Suryaa Now
నెల్లూరులో జనసేన–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు.. చివరి వరకు ఉత్కంఠ

నెల్లూరు, మేజర్ న్యూస్  :    నెల్లూరు నగరంలోని ఆరవ డివిజన్ ఎన్నికల పోరు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కూటమిలో భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీ అభ్యర్థులు చివరి వరకు పోటాపోటీగా తలపడటంతో ఈ డివిజన్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.  పొత్తులో భాగంగా ఉన్నప్పటికీ, జనసేన అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది. తొలుత సహకారం అందిస్తామని చెప్పినట్టే చెప్పి, చివరికి వెనక్కి తగ్గారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  అయితే, పోలింగ్‌కు ముందు చివరి మూడు రోజుల్లో జనసేన క్యాడర్ మొత్తం ఆరవ డివిజన్‌లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరవ డివిజన్ ఓటర్లు ఇచ్చిన తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుంది? ఈ ఫలితం కూటమి పార్టీల మధ్య సమన్వయంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.