telangana
కుమారి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలను సందర్శించిన ట్రైనీ అధికారులు
సూర్య.నేరడిగొండ : కుమారి గ్రామ పంచాయతీలో సోమవారం అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను ట్రైనీ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముచ్చటించి విద్యాబోధన, విద్యార్థుల సమస్యలు, పాఠశాలల్లోని సౌకర్యాలపై ట్రైనీ అధికారులు మనీషా నహోరా, ప్రధ్యుమ్న సింగ్ బిట్టు, అక్షయ్ కుమార్ శర్మ, అనురాగ్ విమల్ వర్మ, మోహిత్ అగర్వాల్ లు ఆరా తీశారు. అనంతరం గ్రామంలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమై వారి సమస్యలు, సంఘాల పనితీరుపై చర్చించారు. అంగన్‌వాడీ సేవలు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధితులతో మాట్లాడారు.ఎంపీడీఓ గంగసాగర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అగ్గిమల్ల గోదావరి, గ్రామస్తులు పాల్గొన్నారు.