వైద్యాధికారుల ఆధ్వర్యంలో సుస్థిర జీవన శైలి వారోత్సవాలు
సీతానగరం, సూర్య : మండలం సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, పి. ఉషారాణి, పి. పావని ఆధ్వర్యంలో సుస్థిర జీవన శైలి వారోత్సవాలు సందర్బంగా 7 రోజులు 7 కార్యక్రమం లను కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధినిరోధక అధికారి డాక్టర్. వై. విజయమోహన్ పాల్గొని మాట్లాడుతూ సుస్థిర జీవన శైలి వారోత్సవాలు మొదటి రోజు ప్రతీ ఒక్కరు ఒక గంట సేపు అయినా విధ్యుత్ ను వినియోగించ కుండా ఆదా చేయాలి. రెండవ రోజు ప్రతీ ఒక్కరు నీటిని అవసరం నకు మాత్రమే ఉపయోగించి పొదుపు చేయాలి. మూడవ రోజు ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండడానికి చెడు అలవాట్లు కు బానిస కాకుండా ఉదాహరణ కు వేలకు ఆహారం తీసుకోవాలి, వేలకు పడుకోవడం, ప్రతీ రోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. నాల్గవ రోజు మంచి పౌష్టిక ఆహారం తో కూడిన ఆహారం ను తీసుకోవాలి. ఐదవ రోజు ప్రతీ ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించడం ఉదాహరణ కు క్యారీ బాగ్స్, ప్లాస్టిక్ కవర్లు.ఆరవ రోజు ప్రతీ ఒక్కరు నిరూపయోగమైన చెత్త పదార్ధలను తగ్గించడం. ఏడవ రోజు ప్రతీ ఒక్కరు అనవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు తగ్గించడం వంటివి ప్రతి ఒక్కరు ఆచరించాలని తెలియజేశారు అనంతరం వ్యాధినిరోధిక వాక్సిన్ ఉన్న గదిని అదేవిధంగా ల్యాబ్ గది ని, ఫార్మసీ గదిని పరిశీలించివెళ్లి దాని యొక్క పనితీరు ను పరిశీలించి ఆసుపత్రి పని తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో సి.హెచ్.ఓ, వెంకటరమణ, పి. ఎచ్. న్, వెంకటరమణమ్మ, ఎచ్.వి, విజయభవాని, ఎచ్. ఎస్, గోపాలనాయుడు, హెల్త్ అసిస్టెంట్లు, సత్యనారాయణ, సత్యారావు, యూ. డి. సి, మురళి, లేబటెక్ని్షన్, నిర్మల, ఫార్మాసిస్ట్, గౌరి, ఎ. ఎన్. ఎమ్ లు, ఎం. ఎల్. హెచ్. పి లు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.