BREAKING
మల్లిపల్లి కూటమిలో చేరిన 11 కుటుంబాలు. ఇటలీలో పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పోస్టులకు భారీగా కోత క్రికెట్, ఎనర్జీతో ‘హై’ మూవీ ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ విడుదల: యూత్‌ను ఆకట్టుకుంటున్న బీట్స్! నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం కావాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి... * కార్మిక సహాయ అధికారి జయశంకర్ * పలాస-కాశీబుగ్గ ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... * మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు * పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమ నిల్వ.. - ఆరు క్వింటాళ్లు పట్టివేత ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ టాటా సన్స్ అంతర్గత వివాదాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు - సూర్య ఎఫెక్ట్ - స్పందించిన ఎమ్మెల్యే ఐటీసీకి షాక్...పెరిగిన సిగరెట్ ధరలతో పడిపోయిన విక్రయాలు ఘనంగా ఊర పండగ విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి. అక్రమ చేప పిల్లల వేటను అరికట్టాలి - ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కమ్యూనిస్టు విప్లవోద్యమ అమరవీరులకు ఘన నివాళులు*

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు

Select Suryaa Now
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    నెల్లూరు నగరంలోని DKW కళాశాలలో తేదీ 03.11.2026న నిర్వహించనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టడం జరిగింది.

ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు :    పొదలకూరు రోడ్డు వైపు వెళ్లే వాహనాలు KVR జంక్షన్ మీదుగా NSR బొమ్మ వద్ద కుడివైపునకు మళ్లి, గాంధీనగర్ మీదుగా పొదలకూరు రోడ్డుకు చేరుకోవాలి.   పొదలకూరు రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలు పొదలకూరు రోడ్డు సర్కిల్ వద్ద కుడివైపునకు మళ్లి, కొండాయపాలెం గేట్ సెంటర్ మీదుగా KVR జంక్షన్ వైపు వెళ్లాలి.

పార్కింగ్ ఏర్పాట్లు :    పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ల వాహనాల పార్కింగ్ కోసం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను కేటాయించడం జరిగింది.   ఎన్నికల కౌంటింగ్ అధికారులు మరియు సిబ్బంది వాహనాల పార్కింగ్ కోసం DKW కళాశాల ప్రాంగణంలోని నిర్దేశిత పార్కింగ్ స్థలాన్ని కేటాయించడం జరిగింది.   ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహనదారులు నిర్దేశించిన మార్గాలను మాత్రమే వినియోగించాలి.   ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉన్న సమయంలో పోలీసు సిబ్బంది సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి.   అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది.  నగర ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులను గమనించి పోలీసు శాఖకు సహకరించి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు తమ వంతు సహకారం అందించవలసిందిగా కోరడమైనది.