BREAKING
మల్లిపల్లి కూటమిలో చేరిన 11 కుటుంబాలు. ఇటలీలో పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పోస్టులకు భారీగా కోత క్రికెట్, ఎనర్జీతో ‘హై’ మూవీ ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ విడుదల: యూత్‌ను ఆకట్టుకుంటున్న బీట్స్! నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం కావాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి... * కార్మిక సహాయ అధికారి జయశంకర్ * పలాస-కాశీబుగ్గ ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... * మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు * పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమ నిల్వ.. - ఆరు క్వింటాళ్లు పట్టివేత ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ టాటా సన్స్ అంతర్గత వివాదాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు - సూర్య ఎఫెక్ట్ - స్పందించిన ఎమ్మెల్యే ఐటీసీకి షాక్...పెరిగిన సిగరెట్ ధరలతో పడిపోయిన విక్రయాలు ఘనంగా ఊర పండగ విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి. అక్రమ చేప పిల్లల వేటను అరికట్టాలి - ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కమ్యూనిస్టు విప్లవోద్యమ అమరవీరులకు ఘన నివాళులు*

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

Select Suryaa Now
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.  ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. 
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ కు సమర్పించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవ రావు, రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.