మాజీ మంత్రి నల్లపరెడ్డి ని కలిసిన కొడవలూరు మండల వైసీపీ నూతన అధ్యక్షుడు మారంరెడ్డి..
కొడవలూరు, మేజర్ న్యూస్ : కొడవలూరు మండలం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన మారంరెడ్డి రంగారెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు గారితో కలిసి నేడు నెల్లూరులోని మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు, కోవూరు నియోజకవర్గ ఇంచార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తనకు మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు ప్రసన్నకుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అశోక్ రెడ్డి, నాగిరెడ్డి రమేష్, నంబూరి ప్రసాద్, మోచర్ల రమేష్, MD. కరిముల్లా, ప్రసాద్ రెడ్డి, బాల భాస్కర్ రెడ్డి, బాల జయవర్ధన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.