BREAKING
కాచాపూర్ గ్రామంలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ కోతుల దాడులతో ప్రజలు బెంబేలు.. టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. దశాబ్దాలుగా టిడిపి జెండా మోసిన వారు, నేడు వైసీపీలో చేరిక... శివనామస్మరణతో మార్మోగిన సిద్ధులగుట్ట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలి గోవా గవర్నర్‌తో తెలుగు బృందం భేటీ - చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై చర్చ సంక్షేమం కుంటుబడుతోంది మంత్రి అడ్లూరితో బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య చర్చలు ప్రజావాణిలో వచ్చిన 71 ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న నజ్రియా నజీమ్: నెట్టింట వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు! అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తాం మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి పోలీసుల రికార్డు – రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం - జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విక్కుర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెరువు కట్టకు బీటలు.. ప్రమాదం పొంచి ఉంది!

ఎస్‌ఐఆర్‌పై అవగాహనకు బీజేపీ మహా పాదయాత్ర 50 వేల మందితో జనసమీకరణ.. ముఖ్య అతిథిగా సునీల్ బన్సల్.

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌పై అవగాహనకు బీజేపీ మహా పాదయాత్ర 50 వేల మందితో జనసమీకరణ.. ముఖ్య అతిథిగా సునీల్ బన్సల్.


సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి.:
నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో జరిగే పాదయాత్రకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి సుమారు 50 వేల మందిని సమీకరించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పవార్ రామారావు పటేల్, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్న సునీల్ బన్సల్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిర్మల్‌కు రానున్నారు. అనంతరం శాంతినగర్ చౌరస్తా నుంచి శివాజీ చౌక్ మీదుగా వివేక్ చౌక్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ఇందుకోసం ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలోని ప్రధాన కూడళ్లను కాషాయ జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించడంతో రాజకీయ సందడి నెలకొంది.