అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తాం
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్
*దేవునిబండ తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఫరూఖ్‌నగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ అన్నారు.
ఫరూఖ్‌నగర్ మండలం దేవునిబండ తండా గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు. సర్పంచ్ ఎం. శ్రీను నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాయికల్ శ్రీనివాస్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీను నాయక్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. అర్హత ఉన్న వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు దేవునిబండ తండా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్యామ్‌లాల్, సర్పంచులు ఆర్. బాబు నాయక్, శివకుమార్, జంగయ్య, మాజీ సర్పంచులు కె. యాదయ్య, కె. బాలు, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం, పుల్లారెడ్డి, దేవగిరి నవీన్, వార్డు సభ్యులు పి. జాను, పి. మారు, డి. ఈశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాదావత్ విరేష్, కె. దశరథ్, డి. సుమన్, లక్ష్మణ్, జగన్, గ్రామ నాయకులు భాస్కర్ నాయక్, శంకర్ నాయక్, మూడవత్ చందు తదితరులు పాల్గొన్నారు.
నరసింహ రెడ్డి మేజర్ న్యూస్…