BREAKING
అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి అమెరికా సెనేట్ ప్రతిష్టాత్మక పర్మిటింగ్ బిల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా నిలుస్తుంది కాప్31 సదస్సుపై చిన్న ద్వీప దేశాల డిమాండ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్! జర్మనీలో కార్మికుల సమ్మెల హోరు అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు! బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల వేడి...ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఓటర్లు సార్లరావుపల్లిలో ఆంజనేయస్వామి, గణపతి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి సర్పంచ్ శ్రీను నాయక్

శివనామస్మరణతో మార్మోగిన సిద్ధులగుట్ట

Select Suryaa Now
శివనామస్మరణతో మార్మోగిన సిద్ధులగుట్ట
సూర్య, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాథ సిద్ధులగుట్ట సోమవారం శివనామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు గుట్టపైకి చేరుకుని శ్రీ సిద్ధేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో, బిల్వపత్రాలతో విశేష అభిషేకాలు నిర్వహించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.అనంతరం రామాలయం, దత్తాత్రేయ స్వామి, దుర్గామాత, అయ్యప్ప స్వామి, ఎల్లమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో భజన మండలి సభ్యులు భక్తి గీతాలు ఆలపిస్తూ పల్లకీ సేవ నిర్వహించారు. భజనలతో గుట్ట పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
దర్శనానికి వచ్చిన భక్తులందరికీ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బి. సుమన్, బీసీ గంగారెడ్డి, కోడిగెల మల్లయ్య, చరణ్ రెడ్డి, జిమ్మీ రవి,  కొంతం మంజుల, మురళి, శ్రీనివాస్, నరేష్, సతీష్‌, బొండ్ల ఆనంద్ లతో పాటు సిద్ధులగుట్ట శివభక్తులు, భజన మండలి సభ్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.