BREAKING
నవంబర్ 20న థియేటర్లలోకి ‘డానీ’: ఇది ఒక కల్ట్, వైల్డ్ డ్రామా అంటున్న హీరో ఆశిష్ గాంధీ! డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టాలి రాష్ట్రస్థాయి కోకో పోటీలకు వేపులపర్తి విద్యార్ధి ఎంపిక. బెజ్జుర్ సోసైటీలో అవకతవకలపై ప్రజావాణి లో పిర్యాదు అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి అమెరికా సెనేట్ ప్రతిష్టాత్మక పర్మిటింగ్ బిల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా నిలుస్తుంది కాప్31 సదస్సుపై చిన్న ద్వీప దేశాల డిమాండ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్! జర్మనీలో కార్మికుల సమ్మెల హోరు

సంక్షేమం కుంటుబడుతోంది మంత్రి అడ్లూరితో బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య చర్చలు

Select Suryaa Now
సంక్షేమం కుంటుబడుతోంది మంత్రి అడ్లూరితో బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య చర్చలు

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ కుంటుబడుతోందని, రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య రెట్టింపు అవుతున్నందన, అదనంగా కాలేజీలు, హాస్టళ్లు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీ హాస్టల్ సీట్లకు బాగా డిమాండ్ ఉన్నందున కొత్తగా అన్ని జిల్లాలలో కలిపి అదనంగా కొత్తగా 100 బీసీ కాలేజీ హాస్టళ్ళు, 150 బి.సి గురుకులాలు, 100 ఎస్సీ, 50 ఎస్టీ హాస్టళ్ళు మంజూరు చేయాలని ఆర్ కృష్ణయ్య సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి సచివాలయంలో చర్చలు జరిపారు. కాలేజీలు ప్రారంభమయ్యాయి. హాస్టల్ సీట్లు దొరకక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 18 సంవత్సరాల క్రితం నాటి జనాభా, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఉన్నవి. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు తగట్లు హాస్టళ్ళు పెంచవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం అవసరాలకు తగ్గట్లు పెంచాలి. సీట్లు లభించడం లేదు వేలాది మంది విద్యార్థులు సీట్లు దొరకక ఇబ్బందులకు గురవుతున్నారు ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు బరించలేక చదువు మానుకుంటున్నారు కావున వెంటనే ప్రభుత్వం స్పందించి తగురీతిగా మంజురు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రస్తుతం బి.సి గురుకుల పాటశాల అడ్మిషన్లకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు రాగా వేల మందికి మాత్రమే సీట్లు ఇచ్చారు. ఇంకా లక్షల సంఖ్యలో విద్యార్థులు సీట్లు లభించక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. బీసీ గురుకుల పాఠశాల అడ్మిషన్ల గురించి రోజు వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అడ్మిషన్లు కావాలని తెలుగు సంక్షేమ భవన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు బాగుపడాలని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఎస్సెస్సీ ఇంటర్ ఫలితాల్లో బి.సి గురుకులాల్లో 99 శాతం ఫలితాలు రావడంతో ఎక్కువ డిమాండ్ పెరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళలో వర్కర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించాలి. ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించడం వలన పని భారం ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నారు. దీనిలో హాస్టల్ విద్యార్ధులకు సమయానికి వంట చేసే వారు లేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రతి హాస్టల్ లలో కొత్త మెనూ ప్రకారం టిఫిన్ లో ఇడ్లీ, వడ, పూరి, బోండా, చపాతీ పెట్టడంతో వర్క్ లోడ్ ఎక్కువ కావడంతో నెల నెల జీతాలు రాకపోవడంతో హాస్టల్ లలో పని చేయలేక వర్కర్స్ హాస్టల్ ఉద్యోగం వదలి వెళ్లిపోతున్నారు. కాబట్టి ప్రతి హాస్టల్ లలో పర్మినెంట్ వర్కర్స్ ను నియమించాలని కోరారు.

సాంఘిక శాఖా మంత్రితో హామీ :

ముఖ్యమంత్రితో చర్చలు జరిపి అన్ని శాఖలకు విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కొత్త పోస్టళ్ళు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళలో వర్కర్లను శాశ్వత ప్రాతిపదికన గురించి త్వరలో ముగ్గురు మంత్రులతో సమావేశం జరిపి చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బి.సి ఫ్రంట్ చైర్మన్ గోరిగే మల్లేష్, బి.సి కులాల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య, బి.సి ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లం యాదయ్య, బి.సి విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగోర్ల మోడీరాందేవ్, బి.సి ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, బలరాం నాయక్, నరేష్ గౌడ్, శివ ముదిరాజ్, వంశీ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.