telangana
గోవా గవర్నర్‌తో తెలుగు బృందం భేటీ - చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై చర్చ
సూర్య, ఆర్మూర్ : మనం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.ఎస్. కుమార్ నేతృత్వంలోని తెలుగు బృందం గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా గోవా రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు, ప్రత్యేకతలపై గవర్నర్‌తో బృంద సభ్యులు ఆసక్తికరంగా చర్చించారు.ఈ సందర్భంగా గోవా రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అక్కడి చారిత్రక కట్టడాల విశిష్టతను గవర్నర్ వివరించారు. పురాతన ఓడరేవులు, చర్చిలు, మసీదులు, దేవాలయాల చారిత్రక నేపథ్యం, మతపరమైన ప్రాధాన్యతను తెలియజేశారు. భిన్న మతాలు, విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి గోవా ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.తెలుగు భాష మాట్లాడే వారిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ ఈ సందర్భంగా అన్నారు. బృంద సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. తమకు సమయం కేటాయించి, గోవా విశేషాలను వివరించిన గవర్నర్‌కు తెలుగు బృందం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో చంద్రబాబు, జి. లక్ష్మణ్ గౌడ్, శేషగిరిరావు, జి. పూర్ణచంద్రరావు, రాహుల్, మాధవ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.