BREAKING
డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టాలి రాష్ట్రస్థాయి కోకో పోటీలకు వేపులపర్తి విద్యార్ధి ఎంపిక. బెజ్జుర్ సోసైటీలో అవకతవకలపై ప్రజావాణి లో పిర్యాదు అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి అమెరికా సెనేట్ ప్రతిష్టాత్మక పర్మిటింగ్ బిల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా నిలుస్తుంది కాప్31 సదస్సుపై చిన్న ద్వీప దేశాల డిమాండ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్! జర్మనీలో కార్మికుల సమ్మెల హోరు అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు!

కాచాపూర్ గ్రామంలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ

Select Suryaa Now
కాచాపూర్ గ్రామంలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ

సూర్య- బిక్కనూర్ : మండలంలోని కాచాపూర్ గ్రామంలో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని మండల పశువైద్యాధికారి దివ్యశ్రీ గ్రామ సర్పంచ్ జ్యోతి సంతోష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ దివ్యశ్రీ మాట్లాడుతూ, పాడి పరిశ్రమలో రైతులు లాభాలు గడించాలంటే దూడల సంరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. దూడలలో నట్టల సమస్య వల్ల రక్తహీనత ఏర్పడి, ఎదుగుదల లోపిస్తుందని, సకాలంలో నట్టల మందులు తాపించడం ద్వారా వాటి మరణాలను అరికట్టవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క రైతు తమ దూడలకు వయస్సును బట్టి కచ్చితమైన కాలపట్టిక ప్రకారం డీవార్మింగ్ చేయించాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో పశువైద్య శాఖ సిబ్బంది ఎల్‌.ఎస్.ఏ  మోహిన్, ఓ.ఎస్ భరత్, గోపాలమిత్రలు సురేష్, మహేష్ పాడి రైతులు పాల్గొన్నారు