BREAKING
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఓ వైపు జోరువాన.. మరోవైపు కోటంరెడ్డి ప్రచార హోరు! నే'తలరాతలు' తేలేది నేడే..! స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులకు దుస్తులు, సామగ్రి కొనుగోలుకు దరఖాస్తుల ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న 'మురాసు' తీవ్ర తుఫాను మాజీ మంత్రి నల్లపరెడ్డి ని కలిసిన కొడవలూరు మండల వైసీపీ నూతన అధ్యక్షుడు మారంరెడ్డి.. కాఫీ విత్ కరణ్ షో చివరి సీజన్‌పై కరీనా ఆసక్తికర వ్యాఖ్యలు: సైఫ్ అలీఖాన్ జోక్‌తో నవ్వులు! ముడి చమురు ధరల పతనంతో 1233 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ఎదులపాడ్‌లో నూతన భవనాల నిర్మాణానికి ఏకగ్రీవ తీర్మానం మరి కొన్ని గంటల్లో పురపాలక ఎన్నికల ఫలితాలు. అభ్యర్థుల్లో ఉత్కంఠ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్,సైన్స్ ఫెయిర్ లలో సత్తా చాటిన గీతాంజలి విద్యార్థులు ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఐదో సీజన్ వేదిక ఖరారు నెల్లూరులో జనసేన–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు.. చివరి వరకు ఉత్కంఠ కుమారి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలను సందర్శించిన ట్రైనీ అధికారులు పుణె నగరానికి రూ. 21,800 కోట్ల మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

25 ఏళ్ల తర్వాత సైదాపురం మండలంలో టీడీపీ జెండా ఎగురవేస్తాం!

Select Suryaa Now
25 ఏళ్ల తర్వాత సైదాపురం మండలంలో టీడీపీ జెండా ఎగురవేస్తాం!

సైదాపురం,  మేజర్ న్యూస్ :   25 ఏళ్ల తర్వాత సైదాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయబోతోందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.సైదాపురం మండలంలోని చాగణం ఆర్.ఆర్. కళ్యాణ మండపంలో సోమవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమాలోచనలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. వెంకటగిరిలో 37 వార్డులను కైవసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకోబోతోందని తెలిపారు. అదే ఉత్సాహంతో సైదాపురం మండలంలోనూ 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని సైతం గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.ప్రతి ఓటరును నేరుగా కలిసి తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, సెలవు రోజులు వస్తే ముందుగానే పింఛన్లు అందించే విధానం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.  
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, క్లస్టర్ యూనిట్ ఇన్‌ఛార్జ్ పెమ్మసాని దిలీప్ నాయుడు, ప్రధాన కార్యదర్శి పెమ్మసాని భాస్కర్ నాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు దర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.