BREAKING
సొంతింటి కల నెరవేర్చే వరకు పోరాటం దుబాయ్ యాక్సెస్ క్లబ్ పేరుతో ప్రపంచంలోనే తొలి సిటీ-లెడ్ లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం రాజాం మల్లికార్జున దేవాలయంలో చోరీ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఓ వైపు జోరువాన.. మరోవైపు కోటంరెడ్డి ప్రచార హోరు! నే'తలరాతలు' తేలేది నేడే..! స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులకు దుస్తులు, సామగ్రి కొనుగోలుకు దరఖాస్తుల ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న 'మురాసు' తీవ్ర తుఫాను మాజీ మంత్రి నల్లపరెడ్డి ని కలిసిన కొడవలూరు మండల వైసీపీ నూతన అధ్యక్షుడు మారంరెడ్డి.. కాఫీ విత్ కరణ్ షో చివరి సీజన్‌పై కరీనా ఆసక్తికర వ్యాఖ్యలు: సైఫ్ అలీఖాన్ జోక్‌తో నవ్వులు! ముడి చమురు ధరల పతనంతో 1233 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ఎదులపాడ్‌లో నూతన భవనాల నిర్మాణానికి ఏకగ్రీవ తీర్మానం మరి కొన్ని గంటల్లో పురపాలక ఎన్నికల ఫలితాలు. అభ్యర్థుల్లో ఉత్కంఠ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్,సైన్స్ ఫెయిర్ లలో సత్తా చాటిన గీతాంజలి విద్యార్థులు ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఐదో సీజన్ వేదిక ఖరారు

నాగర్ కర్నూల్ లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

Select Suryaa Now
నాగర్ కర్నూల్ లో  మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 21వ రోజుకు చేరింది. సమ్మె శిబిరం వద్ద ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ''ఇంకెన్నాళ్లీ ఆత్మఘోష.. మా కష్టాలు, కన్నీళ్లు చాలు మహాప్రభో.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి'' అంటూ విజ్ఞప్తి చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు ఎండనకా, వాననకా విధులు నిర్వర్తించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్య పరిరక్షణలో బాధ్యతాయుతంగా పనిచేశారు. మారుమూల గ్రామాల్లోని పేదలకు సైతం వైద్య సేవలు చేరువ చేసి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలిచారు. అర్ధరాత్రి వేళల్లోనూ అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటూ ఎన్నో కుటుంబాలకు వైద్య భరోసా కల్పించారు. ప్రజారోగ్య పరిరక్షణే బాధ్యతగా భావించి, తమ వ్యక్తిగత అవసరాలను పక్కనపెట్టి విధులు నిర్వర్తించారు. ఇంతటి సేవలందించిన తమకు నేడు ఉద్యోగ భద్రత లేకపోవడం, పిల్లల చదువులు, కుటుంబ పోషణపై ఆందోళన చెందాల్సి రావడం బాధాకరమని వాపోతున్నారు. ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించిన తమ కుటుంబాల భవిష్యత్తుకు మాత్రం భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని తీవ్రవేదన వ్యక్తం చేస్తున్నారు . కార్యక్రమంలో  రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌస్ పాషా, జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా నాయకులు భీముడు, ప్రకాష్, హైమావతి, వనజ, లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
-పి.వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్‌ క్రైమ్, సూర్య న్యూస్