మూడు దశబ్దాల తర్వాత అ'పూర్వ"సమ్మేళనం..
మూడు దశబ్దాల తర్వాత అ'పూర్వ"సమ్మేళనం..
బెజ్జంకి/మేజర్ న్యూస్:
మండల పరిధిలోని బేగంపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96 విద్యా సంత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం లింగారెడ్డి పల్లిలో ఓ ప్రైవేటు పంక్షన్ హలులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.విద్యార్థులు ఒకరినొకరు పరస్పరం వేదికపై పరిచయం చేసుకున్నారు.పాఠశాల స్థాయిలో బాలస్మృతులను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు.సంతోషంగా అందరు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు అందరు కలిసి ఫొటోలు దిగారు.అంతకు ముందు తమతో చదువుకుని ఇపుడు తమ మధ్యలో లేని తోటి విద్యార్థులను,చదువు చెప్పిన గురువులను స్మరించుకుని ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.కార్యక్రమ నిర్వాహ బాధ్యతలు నారెడ్డి అరుణ మధుసూదన్ రెడ్డి,గండ్ర వెంకట రమణ,పాకాల వెంకట కృష్ణారెడ్డి,పాశం శ్రీనివాస్ రెడ్డిలు చేపట్టారు.(సూర్య రిపోర్టర్,భాస్కర్)