వైసీపీ యువ నాయకుడు టీడీపీలో చేరిక
పొదలకూరు, మేజర్ న్యూస్ : పొదలకూరు పట్టణానికి చెందిన వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు పడవల శీను సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ కార్యాలయంలో కలగట్ల సందీప్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా పడవల శీను మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడై టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్టీ పట్ల విధేయతతో పనిచేస్తూ, టీడీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్‌రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, కోవూరు వెంకటేశ్వర్లు, తిరుపతి పార్లమెంటరీ టీఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్, వీరేంద్ర శివ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.