జిల్లా యువజన అధికారి బి.శశికాంత్ రెడ్డిని ఘనంగా సత్కరించిన పి.ఎం.పి, రూడ్స్ సంస్థలు
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : మై భారత్ కేంద్రం నెల్లూరు జిల్లా యూత్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన బి. శశికాంత్ రెడ్డిని సోమవారం నాడు కస్తూరిదేవి కళాక్షేత్రంలోని మై భారత్ కేంద్రం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పి.ఎం.పి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నెల్లూరు జిల్లా అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్‌లు కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా యూత్ ఆఫీసర్ బి. శశికాంత్ రెడ్డి మాట్లాడుతూ... యువతలో సేవాభావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో మై భారత్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ, వారి నైపుణ్యాలను వెలికితీసేందుకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.జిల్లా యువజన అధికారిగా బి. శ్రీకాంత్ రెడ్డి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, నెల్లూరు జిల్లాలో యువజన అభివృద్ధికి విశేష కృషి చేయాలని షేక్ రసూల్, శాఖవరపు వేణుగోపాల్ తెలియజేశారు.