మురసు తుఫాను ప్రభావంతో విద్యుత్ శాఖ అప్రమత్తం - పొదలకూరు విద్యుత్ ఏ.ఈ.రఘు
పొదలకూరు, మేజర్ న్యూస్ : మురసు తుఫాను ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలిస్తూ ఎక్కడైనా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశారు. తుఫాను సమయంలో ప్రజలు విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సమాచారం అందించాలని కోరారు.