BREAKING
డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టాలి రాష్ట్రస్థాయి కోకో పోటీలకు వేపులపర్తి విద్యార్ధి ఎంపిక. బెజ్జుర్ సోసైటీలో అవకతవకలపై ప్రజావాణి లో పిర్యాదు అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి అమెరికా సెనేట్ ప్రతిష్టాత్మక పర్మిటింగ్ బిల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా నిలుస్తుంది కాప్31 సదస్సుపై చిన్న ద్వీప దేశాల డిమాండ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్! జర్మనీలో కార్మికుల సమ్మెల హోరు అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు!

కావలి గ్రామీణ ప్రాంతం సర్వాయిపాలెంలో ముమ్మర ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యే.

Select Suryaa Now
కావలి గ్రామీణ ప్రాంతం సర్వాయిపాలెంలో ముమ్మర ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యే.

​కావలి, మేజర్ న్యూస్ :    స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి రూరల్ మండలం సర్వాయిపాలెంలో ఎన్డీయే కూటమి శంఖారావం పూరించింది. నెల్లూరు పార్లమెంట్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిల నేతృత్వంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీకి ప్రజలు ఉప్పెనలా తరలిరావడంతో గ్రామం జనసంద్రంగా మారింది.  ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వాయిపాలెంతో తనకున్న చిన్ననాటి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఏడేళ్ల వయస్సులో చూసిన గ్రామానికి, నేటి ప్రగతికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. నిరంతరం ప్రజాక్షేమం కోసం పరితపించే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లభించడం కావలి ప్రజల అదృష్టమని కొనియాడారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు.  ​స్థానిక జెడ్పీటీసీ అభ్యర్థి ఉప్పాల సింధుజ, ఎంపీటీసీ అభ్యర్థి సందు మాధురిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్తలు మన్నెమాల సుకుమార్ రెడ్డి, అలహరి సుధాకర్, కూటమి ముఖ్య నేతలు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.