BREAKING
క్లీన్ ఎనర్జీ దిశగా భారత్ దూకుడు అని కొనియాడిన ప్రధాని మోదీ ఎన్ హెచ్ ఆర్ ఏసిసిసిఐ ఫౌండేషన్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ మేదరమెట్ల హరీష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి. కావలి గ్రామీణ ప్రాంతం సర్వాయిపాలెంలో ముమ్మర ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యే. హనోయ్‌లో రక్షణ మంత్రితో భేటీ అయిన ఎన్ఎస్ఏ అజిత్ దోభాల్ అజిత్ కుమార్ ‘డేర్ డెవిల్’ మూవీ గ్రాండ్ లాంచ్: భారీ తారాగణంతో షాలిని నిర్మాణ సంస్థ తొలి చిత్రం! రూ. 53 వేల కోట్లకు పైగా విలువైన నౌకల ఒప్పందాలపై రక్షణ శాఖ సంతకాలు కదం తొక్కిన కేబుల్ టీవీ జర్నలిస్టులు సమస్యను వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ కాచాపూర్ గ్రామంలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ కోతుల దాడులతో ప్రజలు బెంబేలు.. టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. దశాబ్దాలుగా టిడిపి జెండా మోసిన వారు, నేడు వైసీపీలో చేరిక... శివనామస్మరణతో మార్మోగిన సిద్ధులగుట్ట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలి

మైనార్టీ గురుకుల పాఠశాల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపించాలి -- ప్రిన్సిపాల్‌పై ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకోవాలి -- విద్యార్థులకు అందాల్సిన భోజనం, స్నాక్స్ ఎక్కడికి వెళ్తున్నాయో గుర్తించాలి -- కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఆర్డీఓకు ఫిర్యాదు చెందిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

Select Suryaa Now
మైనార్టీ గురుకుల పాఠశాల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపించాలి -- ప్రిన్సిపాల్‌పై ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకోవాలి -- విద్యార్థులకు అందాల్సిన భోజనం, స్నాక్స్ ఎక్కడికి వెళ్తున్నాయో గుర్తించాలి -- కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఆర్డీఓకు ఫిర్యాదు చెందిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

నారాయణపేట, సూర్యన్యూస్: నారాయణపేట జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన భోజనం, వసతి, ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపించాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) నారాయణపేట జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు భానుప్రసాద్, జిల్లా కార్యదర్శి పవన్‌కుమార్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో సగానికి పైగా ప్రతిరోజూ ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న పరిస్థితి నెలకొనడంపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతి, భోజన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంపై ఉన్నప్పటికీ, విద్యార్థులు ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో విచారించాలని అన్నారు. అలాగే విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అందించాల్సిన అల్పాహారం, ఇతర ఆహార పదార్థాలు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులు, సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు వారికి  పూర్తిస్థాయిలో అందుతున్నాయా లేదా అనే విషయాలపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పాఠశాలలో విద్యార్థుల వాస్తవ హాజరు, అంతర్జాల హాజరు వివరాలు, ఆహార నిల్వలు, సరఫరా పుస్తకాలు, భోజన ఖర్చుల బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల నుంచి నేరుగా వివరాలు సేకరించి, భోజనం నాణ్యత, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, వసతి సదుపాయాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కోరారు.

*ప్రజావాణిలో ఆర్డీఓకు ఫిర్యాదు*
ఈ మేరకు కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. మైనార్టీ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్వహణపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులు, సంక్షేమం విషయంలో అధికారులు, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.