ఎన్ హెచ్ ఆర్ ఏసిసిసిఐ ఫౌండేషన్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్
సూర్య- బిక్కనూర్ : మండల కేంద్రానికి చెందిన శ్రీరామ్ వెంకటేష్ అనే యువకుడిని NHRACCCI ఫౌండేషన్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు.ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ, సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ప్రజల హక్కుల పరిరక్షణకు, సమాజ శ్రేయస్సుకు తన వంతు సహకారం అందిస్తానని శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు.