BREAKING
సొంతింటి కల నెరవేర్చే వరకు పోరాటం దుబాయ్ యాక్సెస్ క్లబ్ పేరుతో ప్రపంచంలోనే తొలి సిటీ-లెడ్ లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం రాజాం మల్లికార్జున దేవాలయంలో చోరీ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఓ వైపు జోరువాన.. మరోవైపు కోటంరెడ్డి ప్రచార హోరు! నే'తలరాతలు' తేలేది నేడే..! స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులకు దుస్తులు, సామగ్రి కొనుగోలుకు దరఖాస్తుల ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న 'మురాసు' తీవ్ర తుఫాను మాజీ మంత్రి నల్లపరెడ్డి ని కలిసిన కొడవలూరు మండల వైసీపీ నూతన అధ్యక్షుడు మారంరెడ్డి.. కాఫీ విత్ కరణ్ షో చివరి సీజన్‌పై కరీనా ఆసక్తికర వ్యాఖ్యలు: సైఫ్ అలీఖాన్ జోక్‌తో నవ్వులు! ముడి చమురు ధరల పతనంతో 1233 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ఎదులపాడ్‌లో నూతన భవనాల నిర్మాణానికి ఏకగ్రీవ తీర్మానం మరి కొన్ని గంటల్లో పురపాలక ఎన్నికల ఫలితాలు. అభ్యర్థుల్లో ఉత్కంఠ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్,సైన్స్ ఫెయిర్ లలో సత్తా చాటిన గీతాంజలి విద్యార్థులు ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఐదో సీజన్ వేదిక ఖరారు

జిల్లాలో విద్యుత్తు వినియోగదారుల దినోత్సవం మెదక్​ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్​ఈ నారాయణ నాయక్

Select Suryaa Now
జిల్లాలో విద్యుత్తు వినియోగదారుల దినోత్సవం మెదక్​ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్​ఈ నారాయణ నాయక్

మెదక్  ; మెదక్​ జిల్లాలో విద్యుత్తు వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 3వ తేదీ   విద్యుత్తు వినియోగదారుల దినోత్సవం (కన్సూమర్స్​ డే) నిర్వహిస్తున్నట్లు  జిల్లా విద్యుత్తు శాఖ ఎస్​ఈ నారాయణ నాయక్​ తెలిపారు. ఈ సందర్భంగా  మెదక్​లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ...జిల్లాలో రైతులకు,  గృహావసర విద్యుత్తు వినియోగదారులకు ధీర్ఘకాలికంగా విద్యుత్తు సమస్యలు ఏమైనా ఉన్నా, మీటర్లు, అధిక బిల్లులు వచ్చినా, రైతులకు ట్రాన్స్​ఫార్మర్లకు కానీ, విద్యుత్తు వైర్లకు సంబంధించి తదితర సమస్యలను నేరుగా జిల్లా వ్యాప్తంగా ఆయా సబ్​ డివిజనల్​ ఆఫీసు, మెదక్, తూప్రాన్ డివిజనల్​ ఆఫీసు, మెదక్ జిల్లా సూపరింటెండెంట్​ కార్యాలయాల్లో ఈనెల 3న మంగళవారం నాడు 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు  నిర్వహించే వినియోగదారుల దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను  తెలియజేస్తే వాటిని పరిష్కరించడం జరుగుతుందని ఎస్​ఈ నారాయణ నాయక్​ తెలిపారు. దీంతో పాటు విద్యుత్తు వినియోగదారులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా మెదక్​ జిల్లాలోని ఆయా సబ్​ డివిజనల్, డివిజనల్​, జిల్లా కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి వాటిని పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మెదక్​ జిల్లాకు సంబంధించి విద్యుత్తు వినియోగదారులు, రైతులు ఈనెల 3వ తేదీ సోమవారం నిర్వహించే వినియోగదారుల దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్​ఈ నారాయణ నాయక్​ కోరారు.