బొబ్బిలి ఆర్డీవో కార్యాలయంలో బ్యాలెట్ బాక్సులు భద్రం
బొబ్బిలి, సూర్య : 2వ పురపాలక సంఘ సాధారణ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ పూర్తయిన తరువాత బొబ్బిలి ఆర్డీవో కార్యాలయాల్లో భద్రపరిచారు. ఈ మేరకు బొబ్బిలి ఎన్నికల అధికారి, ఆర్డీవో రామ్ మోహన్ రావు, సహాయ ఎన్నికల అధికారి ఎల్ రామలక్ష్మి సమక్షంలో బ్యాలెట్ బాక్సులు భద్రం పరిచారు.తదుపరి రిసెప్షన్ కౌంటర్లో బ్యాలెట్ బాక్స్ లను స్వాధీనం చేసుకున్న తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో ఉప ఎన్నికల అధికారి మరియు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ బొబ్బిలి, సహాయక ఎన్నికల అధికారి మరియు కమిషనర్ బొబ్బిలి పురపాలక సంఘం మరియు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్, కంటెస్టింగ్ క్యాండిడేట్లు మరియు పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో వీడియోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీతో స్ట్రాంగ్ రూమ్ కు సీల్ వేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది.
అదేవిధంగా వినియోగించని బ్యాలెట్ బాక్సులను వేరొక రూమ్ లో భద్రపరిచి సీల్ వేయడం జరిగిందని తెలిపారు.