BREAKING
టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌తో ఇమ్రాన్ హష్మీ.. పవర్ స్టార్ సినిమా తర్వాత డిఫరెంట్ రోల్‌లో ఎంట్రీ! మురుసు తుఫాన్ ప్రభావం - నీట మునిగిన వరి పంటలు - కౌలు రైతుల ఆవేదన మక్కువ లో రంగు నాయుడు గర్జన కోనాడలో తెదేపా రెబల్ అభ్యర్థి సత్తిబాబు గెలుపు పై ధీమా పేరూరులో అశేష జన సమూహం మద్య ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం !! అంతర్జాతీయ పాప్ వేదికపై భారత్ సత్తా చాటేందుకు ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ మిచెల్ చోంగ్ ప్రత్యేక అన్వేషణ! వనంగుడిలో రంజిల్లిన వేదసభ విజయం పై ధీమా వ్యక్తం చేసిన ఆళ్లగడ్డ జెడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలి. భారీ అంచనాల మధ్య రామాయణం ఐమ్యాక్స్ ట్రైలర్ విడుదల.. సరికొత్త విజువల్ వండర్‌గా సినిమా! రెవెన్యూ సేవలలో అలసత్వాన్ని సహించేది లేదని పారదర్శక రెవిన్యూ పాలన లక్ష్యం శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు పాత రేగ దుప్పలపూడి గ్రామాల్లో విస్తృత పర్యటన రాజమహేంద్రవరం లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన ప్రకృతి వ్యవసాయంతో భూసార పరిరక్షణ అతిధి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

అంగులూరులో టీడీపీలో చేరిన 60 వైసీపీ బీసీ కుటుంబాలు

Select Suryaa Now
అంగులూరులో టీడీపీలో చేరిన 60 వైసీపీ బీసీ కుటుంబాలు

గుడ్లవల్లేరు, మేజర్ న్యూస్: గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామంలో వైసీపీకి చెందిన 60 బీసీ కుటుంబాలు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మెరుగుమాల బాలు నేతృత్వంలో గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, ఏపీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు సమక్షంలో వీరంతా టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ పార్టీ విధానాలు నచ్చి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో పార్టీలో చేరిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి నుంచి ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణం ఉందని, ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో కూటమి నాయకులు, కార్యకర్తలంతా ఒకే కుటుంబంలా ఐక్యంగా పనిచేస్తున్నారని అన్నారు. టీడీపీ బీసీలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీ అని పేర్కొన్నారు. కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ గుడ్లవల్లేరు మండలంలో జనసేన తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వర్రె బలరామకృష్ణతో పాటు కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మెరుగుమాల బాలు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాము అభివృద్ధి దృక్పథం, రైతులకు అండగా నిలుస్తున్న తీరు నచ్చి టీడీపీలో చేరినట్లు తెలిపారు. బాలు నేతృత్వంలో మెరుగుమాల ఈశ్వరరావు, పంది సత్యనారాయణ, మెరుగుమాల కళ్యాణి, మెరుగుమాల చిన్ని, మెరుగుమాల మోహన్‌రావు తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన జడ్పీటీసీ అభ్యర్థి వర్రె బలరామకృష్ణ, గుడివాడ జనసేన ఇన్‌ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడ్లవల్లేరు మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గుడివాడ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.