చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్
చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్
చీరాలలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్,ఆడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ చీరాల, రేపల్లె ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.