ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ.
కళ్యాణదుర్గం: పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు సిబ్బందిని మోహరించి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గతంలో సమస్యలు తలెత్తిన ప్రాంతాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు ప్రత్యేక బృందాలను కూడా అప్రమత్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా చర్యలు చేపట్టారు. ఓటర్లను ఎవరైనా బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించడం లేదా ఇతరులతో గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని, పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలు, ఘర్షణలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్లకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని సూచిస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ప్రజలు సహకరించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ పాటిస్తూ ప్రశాంత వాతావరణానికి సహకరించాలని కోరుతున్నారు. పట్టణవ్యాప్తంగా పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండటంతో పాటు డీఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇదే స్థాయిలో నిఘా కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పండుగైన ఎన్నికలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ప్రశాంతంగా వెళ్లండి.. ధైర్యంగా ఓటు వేయండి.. మీ భద్రతకు పోలీసులు అండగా ఉంటారు అనే సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.