పూడూర్ శివారులో రోడ్డు ప్రమాదం.. కారులోని వారికి తీవ్రగాయాలు
సూర్య కొడిమ్యాల :జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామ శివారులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గూడ్స్ లారీ, కారు వేగంగా ఢీకొనడంతో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి, క్షతగాత్రుడిని కరీంనగర్‌కు తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.