ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు
నంద్యాల మేజర్ న్యూస్;నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నంద్యాల పట్టణం నూనెపల్లె మున్సిపల్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, డైరెక్టర్లు పెద్దిరెడ్డి మౌలాలి రెడ్డి, పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి దంపతులు అమూల్యమైన ఓటును వినియోగించుకున్నారు. ఓటు రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక హక్కు అని ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని సూచించారు.
జయ భారత్ రెడ్డి నంద్యాల జిల్లా