ఓటు హక్కు వినియోగించుకున్న అభిరుచి మధు దంపతులు
--ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి కీలకం
--బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు
నంద్యాల టౌన్ మేజర్ న్యూస్ : నంద్యాల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పోలింగ్ కేంద్రానికి ఆయన తన సతీమణితో కలిసి వెళ్లి, స్థానికంగా ఉన్న బూత్‌లో ఓటు వేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కేవలం హక్కుగానే కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా భావించి తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత కీలకమైన హక్కు అని అభిరుచి మధు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
జయ భారత్ రెడ్డి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ