BREAKING
పరిశ్రమలో నెగ్గాలంటే అంకితభావం చాలా ముఖ్యం: తానిచ్చిన ప్రివిలేజ్‌పై యువ నటుడు బాబిల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ. డా. జి. జానకి షర్మిల. సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు: చిత్ర పరిశ్రమకు షాకిచ్చిన సీబీఎఫ్‌సీ తాజా మార్గదర్శకాలు! వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల బీమా విద్యుదాఘాతంతో ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు మృతి గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి. ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ‘రణబాలి’: నెట్‌ఫ్లిక్స్ పొరపాటుతో లీకైన స్ట్రీమింగ్ డేట్! లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఆర్డీ బర్మన్ వంటి దిగ్గజాల మధ్య నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడ్డాను: అను మాలిక్ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆ రోజు ఎప్పటికీ ప్రత్యేకమే: మహిళల వన్డే వరల్డ్ కప్ విజయంపై భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన భావోద్వేగ వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద రామాయణం సునామీ: రూ. 75 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్, యష్, రణ్‌బీర్ సినిమాల రికార్డులు బ్రేక్! నిఘా నీడలో హరిదాస్ నగర్ గ్రామం.. సీసీ కెమెరాలు ప్రారంభించిన డి.ఎస్.పి నాగేంద్ర చారి కుందుర్పి ఎంపీడీఓ కార్యాలయం లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. ఏపీలో 13 కేంద్రాల్లో రీపోలింగ్ మొరుసు తుఫాను నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి .. జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

ఈ నగరానికి ఏమైంది..?! ఓటుహక్కు వినియోగానికి నిరాసక్తత..

Select Suryaa Now
ఈ నగరానికి ఏమైంది..?! ఓటుహక్కు వినియోగానికి నిరాసక్తత..

* వెలవెలబోయిన పోలింగు కేంద్రాలు..
* 4మొత్తం 62 డివిజన్లలోనూ అదేతీరు..
* 5 గంటలకు ముగిసే సమయానికి.. అంతంతమాత్రమే..
* తర్వాత మెల్లగా పెరిగిన పోల్ పర్శంట్
* ప్రధానపార్టీల్లో టెన్షన్ టెన్షన్
* ఎవరికొంప మునుగుతుందోనని ప్రజల్లో చర్చ....

7విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఊహించనిది జరిగింది. మందకొడి పోలింగు ప్రధాన రాజకీయపార్టీలను కంగుతినిపించింది. ఇది ఏ అభ్యర్థి కొంపముంచుతుందోనన్న చర్చ ప్రజల్లో మొదలైంది.


(విజయనగరం బ్యూరో మేజర్ న్యూస్)

ఇక్కడి పోరు టీడీపీ, వైసీపీగా కాకుండా అదితి వర్సస్ కోలగట్లగా జరిగిన నేపథ్యంలో జిల్లామొత్తం ఆమాటకొస్తే, ఉమ్మడి జిల్లాయావత్తూ ఆకర్షించిందనే చెప్పొచ్చు. ఇరుపార్టీలు శక్తియుక్తులు ప్రదర్శించాయి. పదునైన వ్యూహాలనే అమలుచేశాయి. అంగబలం అర్ధబలం మోహరించి ప్రచారాన్ని హోరెత్తించాయి. సర్వశక్తులు ఒడ్డాయి. నువ్వానేనా స్థాయిలో తలపడ్డాయి.పోలింగు సరళికూడా అదేస్థాయిలో ఉంటుందని పార్టీలతోపాటు ప్రజలు కూడా ఊహించారు. ఈ క్రమంలోనే ఆదివారం పోలింగు రోజున అంతటా ఒకటే ఉత్కంఠ రాజ్యమేలింది. కానీ, సమయం గడుస్తున్నకొద్దీ పోలింగు పుంజుకోకపోవడంతో పార్టీలు, అభ్యర్థులు, మద్దతుదారుల గుండెల్లో గుబులు మొదలైంది. తర్వాత ఊపందుకుంటుందని అనుకున్నా అలాంటిదేమి జరగలేదు. నత్తనడకన సాగిన పోలింగు సాయంత్రం 5 గంటల సమయానికి 59.64 శాతంవద్ద ఆగిపోయింది. ఆ సమయానికి కొన్నిచోట్ల పోలింగు కేంద్రాల గేటులోపలికి వచ్చి బారులు తీరినట్టు కనిపించినా, పోలింగు శాతాన్ని అదేమీ గొప్పగా పెంచే అవకాశం కనిపించలేదు. మందకొడి పోలింగుపై పార్టీల్లో కలవరం స్పష్టంగా కనిపించింది. ఇది మాకు అనుకూలమని టీడీపీ, వైసీపీ చెప్పుకుంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే లోలోపల మాత్రం తీవ్ర ఆందోళన గురవుతున్నాయి.మందకొడి పోలింగుకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డివిజన్ల పునర్విభజనలో శాస్త్రీయత లోపించడమే కారణమేనని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఒకే ఇంట్లో ఓట్లు వేర్వేరు డివిజన్లలో చేరడం, ఎవరి ఓటు ఎక్కడుందో తెలుసుకోడానికి నానా అవస్థలు తలెత్తడం, ఓటరు స్లిప్పుల పంపిణీలో కూడా నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతోపాటు పోలింగుశాతం పెంపు విషయంలో యంత్రాంగం విఫలమైందన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిజానికి, విజయనగర ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువని అనుకుంటారుగానీ, ఓటుహక్కు వినియోగంలో నిరాసక్తత ప్రదర్శించడంలో రాష్ట్రంలోని కొన్ని ముఖ్య పట్టణాలు, నగరాలకు ఏమాత్రం తీసిపోరు.గతంలో జరిగిన ఎన్నో ఎన్నికల్లో పోలింగు శాతం ఈ విషయాన్ని ధృవీకరించగా, తాజాగా కూడా అది రుజువవుతోంది. సంపన్నవర్గాలు, యువత, విద్యాధికులు సైతం ఆనవాయితీగా ఇప్పుడు కూడా ముఖం చాటేశారు.పోలింగు ముగిసే సమయానికి ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లిపోయిన ప్రైవేటు ఉద్యోగులు, ఇతర శ్రమజీవులు చేరుకొని క్యూలో నిలుచోవడంతో కొంత పరువునిలిచిందిగానీ, లేకపోతే, నగర ఎన్నికల చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోయేదే.2021 మార్చి10న జరిగిన మేయర్ ఎన్నికల్లో 64.5 శాతం నమోదైంది. ఈసారి 60 శాతానికి మించేనా అన్న అనుమానాలు ఉన్నాయి. అధికారులు మాత్రం ఫైనల్ ఫిగర్ 62 వరకు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే కొంత ఊరట కలిగించే విషయమవుతుంది.ఓటుకునోటు విషయంలో జరిగిన తేడాలు కూడా పోలింగు శాతాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చునన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.మొత్తానికి, ఈసారిమునుపెన్నడూ లేనంతగా ప్రజాస్వామ్య పండగ పరిహాసానికి గురైందని ప్రజాస్వామ్య వాదులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంపై శ్రద్ద వహించిన యంత్రాంగం పోలింగు శాతం పెంపునకు ముందునుంచి తగిన చర్యలు చేపట్టివుంటే ఈ దుస్థితి ఏర్పడేదికాదని వారు నిష్కర్షగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.రాత్రి ఏడుగంటల సమయంలో కొన్ని పోలింగు బూతుల పరిధిలో ఓటర్లు క్యూలో ఉన్నట్టు వార్తలు వచ్చిన దృష్ట్యా ఏమేరకు పెరుగుతుందనేది వేచిచూడాలి.