తూకివాకం పంచాయతీలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత ప్రచారం
రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట మండలంలో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తూకివాకం పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, తిరుమల రెడ్డి, తూకివాకం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ముని శేఖర్ రెడ్డి తో కలిసి ఎర్రమరెడ్డిపాలెంలో ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గంగారి సుజాతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారానికి గ్రామాల్లో ప్రజల నుంచి స్వాగతం లభిస్తోందని, గంగారి సుజాతకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతూ మద్దతు ప్రకటిస్తున్నారని పార్టీ నాయకులు తెలిపారు.