BREAKING
వాలీబాల్ క్రీడా సామాగ్రిని అందజేసిన ఎస్సై లోకేష్ కుమార్. అనుమతుల్లేని బోర్లపై రెవెన్యూ శాఖ కొరడా! ప్రఖ్యాత స్కామ్ ఫ్రాంచైజీ నుంచి మరో సంచలనం: సుబ్రత్ రాయ్ బయోపిక్‌గా ‘స్కైమ్ 2010’ టీజర్ విడుదల! ఎమ్మెల్యే రాక కోసం ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు. వికారాబాద్ జిల్లాలో విషాదం.. మిస్సింగ్ కేసు నమోదు కాగా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దింది జ్యోతికే: భార్యపై ప్రశంసలు కురిపించిన హీరో సూర్య! కఠిన భద్రతా వలయంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్: బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచి అభిమానులకు దర్శనం! రాప్తాడు దాడి కేసు నిందితుడికి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స. కింగ్ ‘తు మిల్ జాయే’ పాటలో సుహానా ఖాన్: సర్‌ప్రైజ్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ! జడ్పీటీసీ తేజోవతి విజయానికి కూటమి నేతల విస్తృత ప్రచారం కూటమినేతల మాయ మాటలు నమ్మకండి.. ఎర్రకోట రాజీవ్ రెడ్డి ‘మురసు’ తీవ్ర తుఫాన్ ఉధృతి: ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు అంగులూరులో టీడీపీలో చేరిన 60 వైసీపీ బీసీ కుటుంబాలు గ్రామాల సమగ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించండి. త్వరలో నటుడు రాహుల్ బోస్ ఆటోబయోగ్రఫీ: జీవితంలోని ఆసక్తికర విషయాలతో వచ్చే ఏడాది పుస్తక రూపంలోకి!

నిఘా నీడలో హరిదాస్ నగర్ గ్రామం.. సీసీ కెమెరాలు ప్రారంభించిన డి.ఎస్.పి నాగేంద్ర చారి

Select Suryaa Now
నిఘా నీడలో హరిదాస్ నగర్ గ్రామం.. సీసీ కెమెరాలు ప్రారంభించిన డి.ఎస్.పి నాగేంద్ర చారి

సూర్య ..ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గ్రామ పంచాయతీ సహకారంతో ఏర్పాటు చేసిన 08 సీసీ కెమెరాలను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఈరోజు ప్రారంభించారు.ఈ సందర్భంగా నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ...కమ్యూనిటి మరియు నేను సైతం పోసిలింగ్ లో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో నిరంతరంగా కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ప్రజలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ గ్రామాలు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.నేరాల నియంత్రణ, నేరాలకు పాల్పడిన నిందితులను త్వరగా గుర్తించడం, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాలను అరికట్టడంతో పాటు నిందితులపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.గ్రామాల భద్రత ప్రజలందరి బాధ్యత అని, పోలీసులకు ప్రజలు సహకరిస్తూ నేరరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని డీఎస్పీ కోరారు.ఈకార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ సిఐ వెంకటేష్, ఎస్.ఐ రమేష్ , గ్రామపంచాయతీ పాలక వర్గం , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,ఏఏంసీ చైర్మెన్ దేవానందం,వైస్ చైర్మెన్ నంది కిషన్,పలువురు ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు..